ఓ యువకుడు తన ప్రియురాలు ఫోన్ ఎత్తలేదని ఏకంగా ఆమె గ్రామానికి వెళ్లే కరెంట్ వైర్లనే కత్తిరించి వార్తల్లో నిలిచాడు. ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక యువకుడు కరెంట్ పోల్ ఎక్కి పెద్ద కటింగ్ ప్లయర్‌తో వైర్లను కత్తిరించడం కనిపిస్తుంది. దీంతో ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఈ 17 సెకన్ల వీడియో లక్షల మంది దృష్టిని ఆకర్షించింది. తన ప్రేయసి ఫోన్ ఎత్తడం లేదని, కరెంట్ లేకపోతే ఆమె టీవీ ఆఫ్ చేస్తుందని, అప్పుడు తనతో మాట్లాడక తప్పదని ఆ యువకుడు ఆ పని చేసి ఉంటాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఓ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "మహిళ ఫోన్ బిజీగా ఉన్నందుకు కోపంతో ప్రేమికుడు ఆమె గ్రామానికి కరెంటు కట్ చేశాడు" అని క్యాప్షన్ లో రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1.5 కోట్లకు పైగా వ్యూస్, 2.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఒక నెటిజన్ "అతను బాలీవుడ్ సినిమాలు చూడటం మానుకోవాలి" అని కామెంట్ పెట్టాడు.మరో యూజర్ "తన తెలివిని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నాడు" అని రాశారు. ఇంకో యూజర్ "అరే భాయ్, ఈ సర్వీస్‌కు ఎంత ఛార్జ్ చేస్తావు?" అని అడిగాడు."కరెంటు పోతే మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుందని అతడు భావిస్తున్నాడు" అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
ప్రియురాలు ఫోన్ ఎత్తలేదని ఊరికే కరెంటు కట్ చేసిన యువకుడు !
September 02, 2025
0
Tags