స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఛార్జీలను పెంచింది. ఈ కొత్త ఛార్జీ విద్యా సంబంధిత చెల్లింపులు, వాలెట్ లోడ్లు వంటి ఎంపిక చేసిన లావాదేవీలపై వర్తిస్తుంది. ఈ ఛార్జీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. సీఆర్ఈడీ, చెక్,మోబిక్విక్ వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి చెల్లింపులు చేయడానికి ఎస్బీఐ కార్డ్‌ను ఉపయోగిస్తే, 1% ఫీజు వర్తిస్తుంది. అంటే రూ. 1,000 చెల్లింపు చేస్తే, రూ. 10 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్బీఐ కార్డ్‌ని ఉపయోగించి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నేరుగా చెల్లింపులు చేస్తే, ఈ ఫీజు మాఫీ చేయబడుతుంది. ఎస్బీఐ కార్డ్ ఉపయోగించి ఏదైనా వాలెట్‌లో రూ. 1,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే1% ఫీజు వసూలు చేస్తుంది. మర్చంట్ కేటగిరీ కోడ్‌లు 8211, 8220, 8241, 8244, 8249, 8299 కింద గుర్తించబడిన థర్డ్-పార్టీ వ్యాపారులకు విద్య చెల్లింపులపై ఛార్జీ వర్తిస్తుందని SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్ల ఛార్జీలు పెంపు :నవంబర్ 1 నుండి అమలు
September 30, 2025
0
Tags