హైదరాబాద్ లో రూ. 6 కోట్ల గంజాయి పట్టివేత : సిమెంట్ బ్యాగుల చాటున గంజాయి దాచిన దుండగులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నట్లు ఎస్ఓటీ రాచకొండ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీగా గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దుండగులు అతి తెలివితో డీసీఎం వ్యానులో సిమెంట్ బ్యాగుల చాటున గంజాయి దాచినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా డీసీఎంను తనిఖీ చేయగా ఆ సిమెంట్ బ్యాగుల మధ్య 1210 కిలోల గంజాయిను గుర్తించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారుగా రూ.6 కోట్లుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, డీసీఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)