మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. మల్లెపూలు పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్లినందుకు ఆమెకు భారీ జరిమానా విధించారు. ఓనం పండగ వేడుకల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె బ్యాగ్‌లో మల్లెపూల దండ ఉందని అధికారులు గుర్తించారు. దీంతో నవ్యకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. కేరళలో ఓనం పండగ మలయాళీలకు చాలా ముఖ్యమైనది. ఈ సీజన్‌లో మహిళలు పూలతో అలంకరించుకోవడం సాంప్రదాయం. అయితే, నవ్య తన బ్యాగ్‌లో పూలు తీసుకెళ్లడం ఆస్ట్రేలియా చట్టాలకు విరుద్ధమని తెలియకపోవడంతో ఈ జరిమానా ఎదుర్కొన్నారు. విక్టోరియాలోని మలయాళీ సంఘం ఓనం పండగను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆమె బ్యాగ్‌లో 15 సెంటీమీటర్ల మల్లెపూల దండ కనిపించింది. దీంతో అధికారులు ఆమెను అడ్డుకుని, పూలు తెచ్చినందుకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు తన తండ్రి తెచ్చిన మల్లెపూలను నవ్య రెండు భాగాలుగా విభజించారు. ఒక భాగాన్ని కొచ్చి నుంచి సింగపూర్ వెళ్లే సమయంలో తలలో పెట్టుకున్నారు. మిగిలిన పూలను సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా ప్రయాణంలో ఉపయోగించాలని బ్యాగ్‌లో ఉంచారు. అయితే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఇది నిషేధం అని హీరోయిన్ నవ్యకు తెలియదు. తనకు తెలియకపోవడం వల్ల ఈ తప్పు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని నవ్య తెలిపింది. అధికారులు ఈ జరిమానాను 28 రోజుల్లో చెల్లించాలని సూచించారు. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నవ్య నాయర్ మెల్‌బోర్న్‌కు ప్రయాణం చేసే ముందు ఎయిర్‌పోర్టులో తీసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఈ ఫైన్ గురించి ఆమె సోషల్ మీడియాలో వ్యంగ్యంగా షో-ఆఫ్ అని క్యాప్షన్ పెట్టుకున్నారు.
మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో రూ. 1.14 లక్షల జరిమానా !
September 08, 2025
0
Tags