ఓలా ఎలక్ట్రిక్ అరుదైన మైలురాయిని సాధించింది. తమిళనాడులోని క్రిష్ణగిరిలో ఉన్న ఫ్యూచర్‌ఫ్యాక్టరీ నుంచి ఒక మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. 2021 ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించిన ఓలా కేవలం నాలుగేళ్లలోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడూ ఈ ఆనంద క్షణాలు జరుపుకోవాల్సిన సందర్భం అని ఓలా అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక ఆలోచన నుంచి ప్రారంభమై నేడు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని తెలిపారు. మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని, ఇప్పుడే తమ అసలైన జర్నీ ప్రారంభమైందని తెలిపారు. శిలాజ ఇంధనాలతో నడిచే వాహన యుగానికి చరమగీతం పాడడమే తమ లక్ష్యమని, భారత్‌ను ఈవీ హబ్‌గా నిలపడం ధ్యేయమని వివరించారు. ఒక మిలియన్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌ఎక్స్+ స్పెషల్ ఎడిషన్‌ను ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసింది. మిడ్‌నైట్ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. రీసైకిల్ చేసిన కాపర్ వేస్ట్, ఎలక్ట్రోప్లేటెడ్ బార్ ఎండ్స్‌తో ఈ రోడ్‌స్టర్‌ఎక్స్+ను రూపొందించారు. మరోవైపు ఇటీవల జరిగిన సంకల్ప్ ఈవెంట్‌లో 4680 భారత్ సెల్‌తో రూపొందించిన ఎస్1 ప్రో సిరీస్ స్కూటర్లను కంపెనీ ఆవిష్కరించింది. అలాగే ఎస్1 ప్రో స్పోర్ట్ పేరుతో కొత్త స్కూటర్‌ను ప్రకటించి స్పోర్ట్స్ సెగ్మెంట్‌లోకీ అడుగుపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ స్కూటర్లు డెలివరీ కానున్నాయి.
నాలుగేళ్లలో 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసిన ఓలా : రోడ్‌స్టర్‌ఎక్స్+ స్పెషల్ ఎడిషన్ విడుదల
September 16, 2025
0
Tags