అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై బ్యాగ్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు : విద్యార్థిని పుర్రె ఎముక చిట్లినట్టు వైద్యులు గుర్తింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలో ఉన్న భాష్యం పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు సలీం తలపై బ్యాగ్‌తో బలంగా కొట్టాడు. దీంతో  ఆ బాలిక పుర్రె ఎముక చిట్లిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సిఫారసు మేరకు బెంగళూరులోని  ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేయగా పుర్రె ఎముక చిట్లినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం బాలికకు అక్కడ చికిత్స కొనసాగుతోంది.



Post a Comment

0Comments

Post a Comment (0)