ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఐస్‌క్రీం పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్. డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం ఉత్తర కొరియా పర్యాటక రంగంలో పాశ్చాత్య పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు 'భాష'ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్‌బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి.
ఉత్తర కొరియా ఐస్‌క్రీం పదంపై నిషేధం !
September 16, 2025
0
Tags