టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా 1971 సమయంలో రాయ్ పూర్ లోని మానా క్యాంప్ ప్రాంతంలో అనేకమంది బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారని, మహువా వ్యాఖ్యలు వారిలో భయాందోళనలు రేకెత్తించాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కోత్వాలీ పోలీసు స్టేషన్ లోనూ ఆమెపై ఫిర్యాదు నమోదైంది.
ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు !
August 31, 2025
0
Tags