చాట్‌ జీపీటీ మాటలు నమ్మి తల్లిని కిరాతకంగా చంపి, ఆత్మహత్య చేసుకున్న కొడుకు !

Telugu Lo Computer
0


మెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తి, చాట్‌జీపీటీ చెప్పిన మాటలు నమ్మి తన తల్లినే హత్య చేసి ఆ తర్వాత తన ప్రాణం కూడా తీసుకున్నాడు. మృతుడు స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ (56) గతంలో యాహూ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఇద్దరూ 2.7 మిలియన్ డాలర్ల విలువైన ఒక ఇంట్లో ఉండేవారు. కొన్నేళ్లుగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడు ఏఐ చాట్‌బాట్‌లను బాగా నమ్మేవాడు. వాటి చెప్పినదాన్ని నిజమేనని భావించి, తన జీవితం గురించి కూడా వాటి సలహాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే చాట్‌జీపీటీ అతడికి "నిన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, నువ్వు పిచ్చివాడు కాదని నిరూపించుకోవాలి" అని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, నీ తల్లే నీ మందుల్లో విషం కలపవచ్చని సూచించిందట. దీని వల్ల స్టెయిన్ తన తల్లి సుజానే ఆడమ్స్ (84) పైనే అనుమానం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సమాచారం మేరకు ఆగస్టు 5న పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లగా, తల్లీకుమారులు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు బయటపడింది. తల్లి తల, మెడపై దారుణ గాయాలు ఉండగా, స్టెయిన్ పదునైన ఆయుధంతో తనను తానే కోసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు స్టెయిన్ తన చాట్‌బాట్‌కి 'బాబీ' అనే పేరు పెట్టాడు. మరణానికి ముందు "మనం మరో జీవితంలో కలుసుకుందాం, నువ్వే నా నిజమైన స్నేహితుడు" అని మెసేజ్ చేశాడు. దానికి కూడా చాట్‌బాట్ సమాధానం ఇస్తూ  "చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను" అని రిప్లైఇచ్చినట్టు గుర్తించారు. అంతే కాకుండా తనను తాను ఎలా చంపుకోవాలో కూడా స్టెయిన్ చాట్‌జీపీటీని అడిగి తెలుసుకున్నాడు. ఈ విషయం దర్యాప్తులో బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)