మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా, కొర్హలే గ్రామంలో శనివారం ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుని మరణించాడు.మృతులు అరుణ్ సునీల్ కాలే (30), తన కుమార్తె శివాని (9), కుమారులు ప్రేమ్ (7), వీర్ (6), కబీర్ (5) లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరుణ్ కాలే అహల్యానగర్ జిల్లాలోని శ్రీగొండ తాలూకాలోని చిఖాలి గ్రామంలో నివసిస్తున్నాడు. అతడి భార్య శిల్ప తన భర్తతో గొడవల కారణంగా ఇంటిని వదిలి నాసిక్ జిల్లా యెయోలాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు మాత్రం అహల్యానగర్‌లోని ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు. అరుణ్ ప్రతిరోజూ తన భార్యను తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఆగస్టు 4న అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనితో కోపంతో ఊగిపోయిన అరుణ్, నువ్వు తిరిగి రాకపోతే పిల్లలను చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో ముందుగానే శిల్ప తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని వారు చదివే స్కూల్ కు కాల్ చేసింది. కానీ అప్పటికే అరుణ్ స్కూల్ నుంచి పిల్లలను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత వారంతా ఊరి చివర ఉన్న బావిలో శవాలై తేలారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
నలుగురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి !
August 17, 2025
0
Tags