వారం లోగా సుశీల్ కుమార్ సరెండర్ కావాలి : సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


లింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్  బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద జరిగిన మర్డర్ కేసులో రెజ్లర్ సుశీల్ జైలుశిక్ష ఎదుర్కొంటున్నారు. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్‌కర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 4వ తేదీన ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సుశీల్‌కు బెయిల్ మంజూరీ చేసింది. అయితే జస్టిస్ సంజయ్ కరోల్‌, ప్రశాంత్ కుమార్ మిశ్రాలకు చెందిన సుప్రీం ధర్మాసనం ఆ బెయిల్‌ను రద్దు చేసింది. మరో వారం లోగా సుశీల్ సరెండర్ కావాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఓ ప్రాపర్టీ విషయంలో రెజ్లర్ల మధ్య వివాదం చెలరేగింది. మే 2021లో ధన్‌కర్‌పై సుశీల్ కుమార్‌తో పాటు ఇతరులు దాడి చేశారు. ఆ ఘటనలో ధన్‌కర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ధన్‌కర్ తలకు తీవ్రగాయమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)