పోకో ఎం సిరీస్‌లో మరో కొత్త మొబైల్ పోకో ఎం7 ప్లస్ 5జీని విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50 ఎంపీ రేర్ కెమెరాతో వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 19 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సదుపాయంతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేటు, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ఓఎస్ 2.0తో పనిచేస్తుంది. రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌తోపాటు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తోంది. పోకో ఎం7 ప్లస్ 5జీ వెనకభాగంలో 50 ఎంపీ రేర్ కెమెరా ఇచ్చారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇది ఐపీ64 రేటింగ్‌తో వస్తోంది. ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ షేడ్స్‌లో లభించనుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 13,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ. 14,999గా పేర్కొంది. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.1,000 డిస్కౌంట్‌తో పాటు రూ.1,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఉంటుంది.
పోకో ఎం7 ప్లస్ 5జీ విడుదల
August 13, 2025
0
Tags