కర్ణాటకలోని దేవనగరి జిల్లాలోని నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే వ్యక్తి కోళ్ల పెంపకం చేస్తుంటారు. ఆయన వద్ద ఉన్న 10 నాటుకోళ్లలో ఒకటి ఇటీవల నీలం రంగులో గుడ్డును పెట్టింది. సాధారణ గుడ్లకు భిన్నంగా ఉండటంతో మొదట సయ్యద్ షాక్ అయ్యారు. తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ విషయమై చుట్టుపక్కల గ్రామస్తులకి తెలిసి, గుడ్డు చూడటానికి చాలామంది సయ్యద్ ఇంటికి పోటెత్తుతున్నారు. ఈ సమాచారం జంతు సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత, వారు వచ్చి కోడిని పరిశీలించారు. కొన్ని కోళ్లు అప్పుడప్పుడు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెట్టడం సాధారణమేనని, కానీ నీలం రంగు గుడ్డు చాలా అరుదైనదని వారు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్ అనే రసాయనం కారణంగా గుడ్డు నీలం రంగులో ఉండే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన లక్షణాల వల్ల ఏర్పడుతుందని, ఇటువంటి గుడ్ల పోషక విలువలు సాధారణ గుడ్లతో సమానంగా ఉంటాయని స్పష్టం చేశారు.
నీలం రంగులో గుడ్డు పెట్టిన కోడి !
August 28, 2025
0
Tags