ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు కేరళ కోర్టు సెప్టెంబర్ 17 వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకూ ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశించింది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతడిపై దాడి చేశారని నటిపై ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు.
ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మీ మేనన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు
August 28, 2025
0
Tags