సైబర్‌ నేరగాళ్ల కోసం దేశవ్యాప్తంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గాలింపు

Telugu Lo Computer
0


తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు సైబర్‌ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తృత గాలింపు చేపట్టి ఇప్పటి వరకు 27 మంది మహిళలు సహా 228 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా 1,313 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వారంతా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రూ.92 కోట్లు కాజేసినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)