ఆన్‌లైన్‌లో గుర్రపు పందేల బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా అరెస్టు

Telugu Lo Computer
0


న్‌లైన్‌లో గుర్రపు పందేల బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌ పోలీసులు దమ్మాయిగూడలో సోదాలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తోకల నగేశ్‌, వెంకయ్య చౌదరి, చల్లా రమేశ్‌బాబు, సునీల్‌గా గుర్తించారు. నిందితులు షైన్‌వెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 105 మందితో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు పలువురి నుంచి రూ.8.34 కోట్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)