ఒడిశాలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలు

Telugu Lo Computer
0


డిశాలోని దేవ్‌ఘర్‌లో భారీ స్టాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్‌లలో మాత్రమే కాకుండా.. మయూర్‌భంజ్, మల్కన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్‌లలో అన్వేషణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒడిశాలో బంగారు నిక్షేపాల నిల్వలు ఎంత ఉన్నాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇది భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత సంవత్సరం భారతదేశం 700 - 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలో గోల్డ్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతి కొంత తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)