బిల్డర్స్‌ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని హైటెక్స్‌లో నిర్వహించిన క్రెడాయ్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పుల దృష్ట్యా బిల్డర్స్‌ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని సూచించారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. నిర్మాణ రంగ వ్యాపారులు ఇళ్ల నిర్మాణం నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకెళ్తోంది. నిర్మాణం రంగంలోనూ దూసుకుపోతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయ రహదారులు మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తోంది. వరంగల్‌లో విమానాశ్రయం రాబోతోంది. ఆదిలాబాద్‌లోని డిఫెన్స్‌ ఎయిర్‌పోర్టును ప్రజా ఎయిర్‌పోర్టుగా మారుస్తున్నాం. ఎంఎంటీఎస్‌ రైళ్లను ఏసీ రైళ్లుగా మారుస్తాం. సాంకేతిక కారణాలతో మెట్రో పెండింగ్‌లో ఉంది. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. సికింద్రాబాద్‌లో రూ.720 కోట్లతో రైల్వే పనులు చేస్తున్నాం. హైదరాబాద్‌-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)