సిమ్లాలో శునకాలకు క్యూఆర్‌ కోడ్‌, జీపీఎస్‌ను అమర్చనున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరంలోని అన్ని వీధి కుక్కలకు క్యూఆర్‌ కోడ్‌, జీపీఎస్‌ను అమర్చనుంది. ఇటీవల ఢిల్లీ, ఎన్సీఆర్‌లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులకే సిమ్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నగరంలోని వీధి కుక్కల మెడపై క్యూఆర్‌ కోడ్, జీపీఎస్‌ వంటి స్మార్ట్‌ ట్యాగ్‌లను అమర్చనున్నారు. దీని వల్ల స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ సమాచార నమోదు, వాటి ఆరోగ్య పరిస్థితి, వయసు వంటి సమాచారం పొందుపరుస్తారు. ఇక క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వాటి వివరాలను తెలుసుకోవచ్చు. జీపీఎస్‌ సహాయంతో వీధి కుక్కల లొకేషన్‌పై ఎప్పటికప్పుడు నిఘాతో పరిశీలించొచ్చు. సిమ్లాలో వీధి కుక్కల సంచారం తీవ్రమైన సమస్యగా ఉంది. రద్దీగా ఉండే మార్కెట్లు , నివాస ప్రాంతాలలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలు , వృద్ధులను కుక్కలు వెంబడించడం, దాడి చేయడం వంటి సంఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ట్యాగ్‌లను అమర్చడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)