మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ విద్య, వైధ్యం సామాన్యుడికి దూరం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ రెండు రంగాలు సామాన్యుడికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. అయితే అవి ఇపుడు అందనంత దూరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఈ వ్యవస్థలు గతంలో సేవా రంగంగా ఉండేవని ఆయన గుర్తు చేసారు. అయితే తరువాత కాలంలో మాత్రం వ్యాపారమే ఇందులో కూడా ప్రవేశించింది అని అన్నారు. ఆరోగ్య సమరక్షణ, అందరికీ విద్య అన్నది సామాన్యుడి నుంచి ఎందుకు దూరం అయ్యాయో తనకు అసలు అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. ఈ వైఖరి ధోరణి మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం అయితే విద్య వైద్య రంగాలు రెండూ సామాన్యులకు చేరువగా ఉన్నాయని చెబుతూ వస్తోంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని కూడా లెక్క చూపుతున్నారు. అలాగే జాతీయ విద్యా విధానం అని అనేక సంస్కరణలు తెచ్చామని చెబుతున్నారు. సామాన్యుడే తమ అజెండా అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మరి ఈ రెండు రంగాలే పేదలకు దూరం అని ఆర్ఎస్ఎస్ అంటోంది.
దేశంలో విద్య, వైద్యం సామాన్యుడికి దూరం అయ్యాయి !
August 11, 2025
0
Tags