కర్ణాటకలోని బందీపూర్ అటవీ ప్రాంతానికి టూరిస్టులు వస్తుంటారు. కేరళ టూరిస్ట్ కారులోంచి బయటకు దిగి ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే గజరాజు కోపంగా ఉన్నట్లుంది. అంతే అమాంతంగా పర్యాటకుడిని పరుగులు పెట్టించి దాడి చేసింది. టూరిస్ట్ కింద పడిపోగానే కాలుతో తన్ని వెళ్లిపోయింది. అనంతరం కొంత మంది బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడడంతో ప్రాణాలు దక్కాయి. అతడు ఎవరనేది గుర్తిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఏనుగుతో సెల్ఫీ తీసుకుంటుండగా గజరాజు దాడి : వీడియో సోషల్ మీడియాలో వైరల్
August 11, 2025
0
Tags