జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిల్వలు ?

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాథమిక సర్వేలు ప్రకారం ఈ బంగారు నిల్వలు సుమారు 100 హెక్టార్లకు పైగా విస్తరించి ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మైనింగ్ ప్రాంతం లక్షల టన్నుల వరకు పసుపు లోహ ఖనిజ సంపదను కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అధికారికంగా నిర్ధారణ అయితే జబల్‌పూర్ జిల్లా దేశంలోని అతి ముఖ్యమైన బంగారు గనుల కేంద్రమైనట్లు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు బంగారు నిల్వల ద్వారా పేరుపొందగా, తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరుతోంది. ఇది జాతీయ ఆర్థిక భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ గనుల వృద్ధి ద్వారా కేవలం ప్రభుత్వ ఆదాయమే కాకుండా.. స్థానికంగా ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)