తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండలపై దట్టమైన పొగమంచు పేరుకుపోయింది. దీంతో ఘాట్ రోడ్ పై వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళుతున్నారు. శ్రీవారి ఆలయం చుట్టూ అలుముకున్న పొగమంచు భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ కూల్ వెదర్‌ను ఎంజాయి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎండ, ఉక్కపోతకు జనాలను అల్లాడుతుంటే.. తిరుమలకు వచ్చిన భక్తులు మంచు తెరల వాతావరణంలో సేద తీరుతున్నారు.
తిరుమలలో భక్తులకు కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు !
August 07, 2025
0
Tags