యూపీఎస్‌సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మన్ కీ బాత్ 125 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరై తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిభా సేతు పేరుతో ఈ పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. యూపీఎస్‌సీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్‌సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ 125 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్‌సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో స్వదేశీ వస్తువులు, ఆకస్మిక వరదలు, క్రీడలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'యూపీఎస్‌సీ దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒక్కటిగా ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలను యూపీఎస్‌సీ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అత్యంత ప్రతిభావంతులైన వేలాది మంది అభ్యర్థుల స్వల్ప తేడాతో తుది జాబితాలో చోటు దక్కించుకోలేక పోతుంటారు. ఫలితంగా వారు వేరే పరీక్షల కోసం మళ్లీ సిద్ధం కావాల్సి వస్తోంది. దీని వల్ల సమయం, డబ్బు రెండు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసం కొత్తగా ప్రతిభా సేతు పేరుతో డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించాం. ఈ ప్రతిభా సేతు పోర్టల్ లో యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో అన్ని దశలు దాటి తుది జాబితాలో చోటు దక్కని వారి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్ లో 10వేల మందికి పైగా ప్రతిభావంతులైన సమాచారం ఉంది. ఈ పోర్టల్ ద్వారా ప్రైవేటు సంస్థలు అభ్యర్థుల సామర్థ్యాన్ని తెలుసుకొని ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
యూపీఎస్‌సీ అభ్యర్థులకు 'ప్రతిభా సేతు' పోర్టల్ ప్రారంభం !
August 31, 2025
0
Tags