స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఫీజు రూ.14కి పెంపు

Telugu Lo Computer
0


స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.14కి పెంచింది. గతంలో ఇది కేవలం రూ.2 మాత్రమే ఉండేది. ఈ పెంపు మాత్రం అన్ని ప్రాంతాల్లో కాకుండా, అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. స్విగ్గీ ప్రకారం, ఫెస్టివల్ సీజన్‌లో ఆర్డర్లు విపరీతంగా పెరగడంతో, ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇంకొవైపు, ప్రధాన పోటీదారు జొమాటో మాత్రం రూ.10 ప్లాట్‌ఫారమ్ ఫీజు వద్దే కొనసాగుతోంది. దీంతో వినియోగదారులు ధరల పరంగా రెండు యాప్స్‌ను పోల్చుకోవడం ప్రారంభించారు. ఇటీవల ఫుడ్ డెలివరీ రంగంలో హ్యాండ్లింగ్ ఫీజులు, కన్వీనియెన్స్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ఒక ఆర్డర్ మొత్తం విలువలో 1-3 శాతం చొప్పున ఉంటుంది.మెట్రో నగరాల్లో బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్ కూడా డెలివరీ ఛార్జీలను గణనీయంగా పెంచాయి. ఈ కారణంగా వినియోగదారులు కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి సంస్థలదే రాజ్యం. వేరే ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్లే, స్మాల్ ఆర్డర్ ఫీజు, కన్వీనియెన్స్ ఛార్జ్ వంటివి ఆమోదయోగ్యంగా మారిపోయాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేస్తేనే, సంస్థలకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మార్కెట్‌లో స్థిరపడేందుకు భారీగా ఖర్చు చేసిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.అన్ని సంస్థలూ డెలివరీ ఫీజులు పెంచుతుండడంతో, వినియోగదారులకు పెద్దగా ఎంపికలు లేకుండాపోయాయి. పెద్ద ఆర్డర్లకు ఇవి బాగా నష్టంగా మారకపోవచ్చు కానీ, చిన్న ఆర్డర్లకు ఇది భారమే.

Post a Comment

0Comments

Post a Comment (0)