హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తి అరెస్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ పరిధిలో ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేసిన దారుణం సంఘటన శుక్రవారం బయటపడింది. వివరాల్లోకి వెళితే రామాంతపూర్‌లో నివసించే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ దంపతుల కొడుకు, ఆగస్టు 12న సాయంత్రం నుంచి కనిపించలేదు. ఆందోళనకు లోనైన తల్లిదండ్రులు వెంటనే ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి ఆచూకీ లేదంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి (బీహార్‌కు చెందిన కమర్) అనుమానాస్పదంగా చిన్నారితో కనిపించాడు.దానితో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కమర్‌ను ప్రశ్నించిన పోలీసులకు షాక్ తగిలింది. బాలుడిని తన వెంట తీసుకెళ్లిన కమర్, ఓ ముళ్లపొదల ప్రాంతంలో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారిని అక్కడే గొంతునులిమి హత్య చేశాడు. దీనిని కమర్ స్వయంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. పోలీసులు శుక్రవారం రాత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)