ఉత్తర భారతం నుంచి తెలంగాణకు వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, తాము ఎలా బతకాలంటూ వాపోతున్నారు లోకల్ వ్యాపారస్తులు. మార్వాడీ వ్యాపారస్తులు గోబ్యాక్ అంటూ నిరసన తెలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వ్యాపారస్తులు ఈ నెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు. అటు మార్వాడీలకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నారని, గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవడానికి రావట్లేదని పేర్కొన్నారు. తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి ? మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే, మేం రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం అని బండి సంజయ్ హెచ్చరించారు.
18న మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా స్వచ్ఛంద బంద్‌కు పిలుపు
August 16, 2025
0
Tags