ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ జీ.వి. సందీప్ చక్రవర్తి ఆరోసారి రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం అందుకుని అరుదైన ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధికసార్లు ఈ పతకం పొందిన కొద్దిమంది ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరిగా నిలిచారు. జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. సందీప్ చక్రవర్తి తండ్రి డాక్టర్ జీ.వి. రామగోపాల్ రావు, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి పీసీ రంగమ్మ కూడా ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. సందీప్ చక్రవర్తి జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. కర్నూలు నగరంలోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన, హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2005లో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు
ఐపీఎస్ సందీప్ చక్రవర్తికి ఆరోసారి పీఎంజీ మెడల్ !
August 15, 2025
0
Tags