జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలకు 12 మంది మృతి

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టావర్‌లో గురువారం మేఘ విస్పోటనం కారణంగా భారీ వర్షాలు కురిసి 12 మంది మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. భారీ వర్షాల కారణంగా 12 మంది మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలంటూ పౌర, పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)