హైదరాబాద్ లో ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఒక మహిళ రచ్చ చేసింది. సదరు మహిళ స్టాప్ లో కాకుండా వేరే చోట ఆపమని చెప్పింది. కానీ అసలే వర్షాలు, రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి కుదరదని స్టాప్ వచ్చే వరకు ఆగాలని లేడీ కండక్టర్ మహిళ ప్రయాణికురాలుతో చెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఆమె డ్రైవర్ ను బూతులు తిడుతూ రెచ్చిపోయింది. బస్సు ఎందుకు ఆపరని నానా రచ్చ చేసింది. దీంతో బస్సు ఆపడంతో ఆమెతో లేడీ కండక్టర్ మాట్లడుతుండగానే ఆమెపై దాడి చేసింది. ఇష్టమున్నట్లు కొడుతూ నానా బీభత్సం చేసింది. అక్కడున్నవారు చెబుతున్నా ఆ మహిళ ప్రయాణికురాలు వెనక్కు తగ్గడంలేదు. మొత్తంగా ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఒక వైపు ఉచిత బస్సు ప్రయాణంపై రేవంత్ సర్కారు మహిళలకు మేలు చేశామని భావిస్తున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్ లు వేస్తుంది.
మహిళా కండక్టర్‌పై దాడి చేసిన ప్రయాణికురాలు : సోషల్ మీడియాలో వీడియో వైరల్
August 14, 2025
0
Tags