ఎమర్జెన్సీ కోటా నిబంధనలలో మార్పులు చేసిన రైల్వేశాఖ

Telugu Lo Computer
0


రైలు ప్రయాణానికి సంబంధించిన అత్యవసర కోటా నిబంధనలను భారత రైల్వేశాఖ కఠినతరం చేసింది. ఇకపై అన్ని అత్యవసర కోటా దరఖాస్తులను ప్రయాణానికి కనీసం ఒక రోజు ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సైతం అదే రోజు దరఖాస్తు చేసుకునే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. అయితే ఇలా చేయడానికి ఓ కారణమే ఉంది. అదే రోజు టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల రైల్వే ఛార్ట్‌ల తయారీని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. దీని వల్ల కార్యకలాపాల్లో జాప్యం జరుగుతోంది. వీటిని పూర్తిగా నిర్మూలించడానికే భారతీయ రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తులకు నిర్దిష్ట గడువు సమయాలను కూడా నిర్ణయించారు. ఉదయం 00:00 గంటల (12 గంటల) నుంచి మధ్యాహ్నం 14:00 (2 గంటల) మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించిన అత్యవసర కోటా దరఖాస్తులు అంతకు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఈక్యూ సెల్‌కు చేరాలి. అలాగే మధ్యాహ్నం 14:01 గంటల నుంచి రాత్రి 23:59 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు.. అంతకు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు అందాల్సి ఉంటుంది. ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో దరఖాస్తులను అంతకు ముందు పని దినం నాడే సమర్పించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)