బీహార్‌లో ఐదుగురు నిందితులు తాపీగా ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చొరపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని కాల్చి చంపారు. సీఎం నితీష్ కుమార్ నివాసానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. గురువారం పాట్నాలోని రాజాబజార్ పారస్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్యకేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న చందన్ మిశ్రా ప్రస్తుతం పేరోల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా పారస్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా చందన్ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకే చందన్ షేరు గ్యాంగ్ ప్రాణాలు తీసినట్లు పాట్నా ఎస్‌ఎస్‌పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు. మరోవైపు, పట్టపగలే నిందితులు ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్ మిశ్రా హత్య వెనుక ఆస్పత్రి వర్గాల ప్రమేయో కూడా ఉండొచన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు, యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని ఆచూకీ గుర్తించేందుకు పాట్నా పోలీసులు బక్సర్ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వారి గాలింపు చర్యలు చేపట్టారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని కాల్చి చంపిన దుండగులు
July 17, 2025
0
Tags