వివాదాస్పదమైన చిదంబరం వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


పరేషన్‌ సిందూర్‌'పై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీనిపై సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనికి ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పహల్గాం ఉగ్రదాడి వెనక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా తీవ్రంగా మండిపడింది. అసలేం జరిగిందంటే.. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ ''పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏం చేసిందన్నది బయటపెట్టేందుకు ప్రభుత్వం విముఖత చూపిస్తోంది. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. వారు దేశీయ ఉగ్రవాదులే కావొచ్చన్న సందేహాలూ ఉన్నాయి. అలాంటప్పుడు పాకిస్తాన్‌ నుంచి వచ్చారని ఎలా అనుకుంటారు? దానికి ఆధారాలున్నాయా?'' అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేగాక పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో భారత్‌ వైపు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదని చిదంబరం ఆరోపించారు. ''దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు తప్పుబడుతోంది? ప్రధాని మోడీ చాలాచోట్ల దీని గురించి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ, పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు?'' అని కాంగ్రెస్‌ నేత దుయ్యబట్టారు. భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన కూడా తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ కేంద్రాన్ని విమర్శించారు. దీంతో చిదంబరం వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ ''పాకిస్తాన్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మరోసారి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మన భద్రతా దళాలు తిప్పికొట్టిన ప్రతిసారీ కాంగ్రెస్‌ నేతలు భారత ప్రతిపక్ష నాయకుల్లా కాకుండా ఇస్లామాబాద్‌ డిఫెన్స్‌ లాయర్లుగా మాట్లాడుతారు ఎందుకో? దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అస్పష్టత ఉండదు. కానీ, కాంగ్రెస్‌ అలా ఆలోచించడం లేదు. వారు ఎల్లప్పుడూ శత్రువును రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు'' అని చిదంబరంపై మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)