ప్రపంచంలో అరుదైన బ్లడ్‌ గ్రూపు 'గోల్డెన్‌ బ్లడ్‌'

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ బ్లడ్‌ గ్రూప్‌ పేరు 'గోల్డెన్‌ బ్లడ్‌'. ప్రపంచవ్యాప్తంగా 50 కన్నా తక్కువమంది మాత్రమే ఈ గ్రూప్‌ రక్తం పరిధిలోకి వస్తారు. ఎర్రరక్త కణాల్లో Rh యాంటీజన్‌లు లేకపోతే దాన్ని Rh- నల్‌ రకం లేదా 'గోల్డెన్‌ బ్లడ్‌' గ్రూప్‌ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ బ్లడ్‌ గ్రూప్‌ కొరత, ప్రత్యేకతల దృష్ట్యా దీనికి ఆ పేరు పెట్టారనుకోవచ్చు. అరుదైన యాంటీజెన్‌లను కలిగిఉన్న వ్యక్తుల్లో గోల్డెన్‌ బ్లడ్‌ మూలాలను గుర్తించొచ్చు. ఇవి O పాజిటివ్‌, O నెగెటివ్‌, ఎ పాజిటివ్‌, ఎ నెగెటివ్‌, బి పాజిటివ్‌, బి నెగెటివ్‌, ఏబీ పాజిటివ్‌, ఏబీ నెగెటివ్‌ వంటి ప్రసిద్ధ రక్త గ్రూప్‌లను కలిగిఉన్నవారి కన్నా భిన్నంగా ఉంటాయి. 1961లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆదివాసీ మహిళ రక్త పరీక్షలు చేయించుకోగా.. ఆమె రక్తంలో A, B లేదా Rh యాంటీజన్‌లు లేవని తేలడంతో తొలిసారి 'గోల్డెన్‌ బ్లడ్‌' గ్రూప్‌ కేసుగా ఇది నమోదైంది. భారత్‌లోనూ ఈతరహా కేసు 2022 జులై 14న వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి గుండెపోటు రావడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడిది గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్‌గా నిర్ధరించారు. వైద్య రంగంలో ఈ గ్రూప్‌నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్‌ని ప్రాణప్రదాయినిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బ్లడ్‌ గ్రూప్‌ విశ్వదాత. ఏ గ్రూప్‌ వారికి అవసరమైనా.. కళ్లు మూసుకొని గోల్డెన్‌ గ్రూప్‌ రక్తం ఎక్కించవచ్చు. రియాక్షన్‌కు ఆస్కారం తక్కువ. కాకపోతే, Rh-null బ్లడ్‌ గ్రూపు ఉన్న వ్యక్తులు అదే రకమైన దాతల నుంచి మాత్రమే రక్తం పొందాల్సి ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత అరుదు, ఖరీదైనదిగా మారింది. ఈ రక్తం ఇమ్యునోగ్లోబులిన్‌ ఆధారిత ఔషధాలను అభివృద్ధి చేయడంలో కీలకంగా మారుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)