సంపాదన పట్ల కాకుండా సమాజసేవపై నిబద్ధత, న్యాయ వ్యవస్థపై గౌరవంతో విధులు నిర్వర్తించాలి : జస్టిస్ గవాయ్‌

Telugu Lo Computer
0


నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశంలో సీజేఐ ప్రసంగిస్తూ హక్కులపై అవగాహన లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ పేర్కొన్నారు.  దేశంలోని పౌరులకు రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కులపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో ఉన్నట్లుగా ఎటువంటి విభేదాలు లేకుండా అన్ని వర్గాలు సామరస్యంగా జీవించే పాత కశ్మీర్‌ను పునరుద్ధరించుకోవాల్సి అవసరం ఉందన్నారు. దేశంలోని పౌరులందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి న్యాయవాదికి ఉందని ఆయన పేర్కొన్నారు. గత 35 ఏళ్లుగా కశ్మీర్‌లోని పరిస్థితుల్లో చాలా మార్పులు, లోపాలు తలెత్తాయని..వాటిని తొలగించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని న్యాయవాదులకు సూచించారు. సంపాదన పట్ల కాకుండా సమాజసేవపై నిబద్ధత, న్యాయ వ్యవస్థపై గౌరవంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయొద్దని పేర్కొన్నారు. దేశంలోని చివరి పౌరుడికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం అందేలా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషి చేస్తోందని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)