తెలంగాణలోని నల్గొండలో శనివారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కుమారుడిని కన్నతల్లి బస్టాండ్‌లో వదిలేసి ఓ వ్యక్తితో వెళ్లిపోయింది. తల్లి కనిపించక పోవడంతో బాలుడు గుక్కపట్టి ఏడ్చాడు. బాలుడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. నల్గొండ రెండో పట్టణ ఎస్సై సైదులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే నల్గొండకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. ఆ యువకుడి కోసం ఆమె హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకుంది. బాలుడిని అక్కడే వదిలేసిన తల్లి స్థానిక బస్టాండ్ నుంచి బైక్‌పై ప్రియుడితో కలిసి వెళ్లింది. సీసీ కెమెరాల ఆధారంగా వారి జాడను పోలీసులు గుర్తించారు. అనంతరం సదరు వ్యక్తిని, మహిళను పీఎస్‌కు తీసుకొచ్చారు. మహిళ ఇచ్చిన సమాచారంతో ఆమె భర్తను అక్కడికి పిలిపించి బాలుడిని అతడికి అప్పగించారు.
నల్గొండలో అమానవీయ ఘటన : రెండేళ్ల బిడ్డను వదిలేసి యువకుడితో వెళ్లిన మహిళ
July 27, 2025
0
Tags