39 బంతుల్లో సెంచరీ చేసిన డివిలియర్స్‌

Telugu Lo Computer
0


రల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే భీకర ఫామ్‌లో ఉన్న ఏబీడీ ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఏబీడీతో పాటు మరో ఓపెనర్‌ జేజే స్మట్స్‌ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ​ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఏబీడీ-‍స్మట్స్‌ తొలి వికెట్‌కు 187 పరుగులు జోడించాక, సౌతాఫ్రికా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు జేపీ డుమిని (16), మోర్నీ వాన్‌ విక్‌ (3), హెన్రీ డేవిడ్స​ (1), వేన్‌ పార్నెల్‌ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్‌ సిడిల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రెట్‌ లీ, స్టీవ్‌ ఓకీఫ్‌, డేనియల్‌ క్రిస్టియన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.ఈ టోర్నీలో ఏబీడీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి చివరి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్‌ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)