ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది. మరోవైపు కృష్ణా, గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈనెల 17న రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు.
జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు
July 14, 2025
0
Tags