కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. సాస్కి కింద అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రెవెన్యూ లోటు భర్తీకి 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన వినతిని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి రెండో విడత నిధులను గ్రాంటుగా విడుదల చేయాలని అభ్యర్థించారు. విభజన కారణంగా రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని నిర్మల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
July 16, 2025
0
Tags