ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా లాభంలో 34 శాతం వృద్ధి

Telugu Lo Computer
0


టెక్‌ మహీంద్రా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.1140.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో రూ.851.5 కోట్లతో పోలిస్తే నికర లాభంలో 33.9 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 2.65 శాతం వృద్ధితో రూ.13,005 కోట్ల నుంచి రూ. 13,351.2 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు నికర లాభం 2.2 శాతం క్షీణించగా ఆదాయంలోనూ 0.2 శాతం క్షీణత నమోదైంది. కంపెనీలో జూన్‌ 30 నాటికి 1,48,517 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 897 పెరిగిందని తెలిపింది. గడిచిన 12 నెలల్లో వలసల రేటు 12.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. తమ పనితీరు స్థిరంగా బలోపేతం అవుతోందని, డీల్స్‌లో 44 శాతం వృద్ధి నమోదైందని టెక్‌ మహీంద్రా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ జోషి ఫలితాల సందర్భంగా పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.94 శాతం లాభంతో రూ.1609 వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)