వికటించిన నటి ఉర్ఫీ జావేద్ సర్జరీ !

Telugu Lo Computer
0


నటి ఉర్ఫీ జావేద్ సినీ రంగం లోకి వచ్చే ముందు ఈమె మోడల్ గా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె 'బడే భయ్యా కి దుల్హానియా' అనే టీవీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకు వరుసగా సీరియల్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 2017 లో ఈమె చేసిన 'చంద్ర నందిని' అనే సీరియల్ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఈ సీరియల్ ని తెలుగు లోకి కూడా దబ్ చేశారు. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో అనేక సీరియల్స్ లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. 2021 వ సంవత్సరం లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా చేసింది. ఈ సీజన్ తో ఆమె ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యింది. అంతే కాదు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన 'ది ట్రైటర్స్ ఇండియా' విన్నర్ గా కూడా నిల్చింది.  ఈమధ్యనే ఈమె తన పేదలకు సర్జరీ చేయించుకుంది. అది వికటించడం తో అందవికారంగా మారిపోయింది. ఇప్పుడు ఈమెను ఆడియన్స్ అసలు గుర్తు పట్టలేకపోతున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)