మాల్దీవుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ పర్యటన తర్వాత మాల్దీవులకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ కి, ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు సాగనుండగా, మోడీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.ఈ పర్యటనలో భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాలు వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. గత కొంత కాలంగా మాల్దీవులు చైనా ప్రభావానికి లోనై, భారత్‌తో సంబంధాల్లో వెనుకడుగు వేశాయి. భారత రక్షణ దళాలను దేశం విడిచిపెట్టాలని చెప్పడమే కాక, భారత సహకారంతో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులను నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. దీంతో భారత్‌లోని పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో మాల్దీవుల టూరిజం భారీగా తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన వైఖరిని సవరిస్తూ, భారత్‌తో బంధాలను పునరుద్ధరించేందుకు ముందుకొచ్చారు. 2024లో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన, మోదీకి మాల్దీవులకు రావాలని స్వయంగా ఆహ్వానం పలికారు. ఇప్పుడు మోదీ పర్యటనకు వెళ్తుండటంతో, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమయ్యే అవకాశముంది .

Post a Comment

0Comments

Post a Comment (0)