ఆగస్టు 29 నుంచి ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం !

Telugu Lo Computer
0


గస్టు 29 నుంచి ప్రో కబడ్డీ లీగ్  12వ సీజన్ వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఈసారి నాలుగు వేదికల్లో టోర్నీని నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేశారు ని ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ అంతటా 12 జట్లు ట్రోఫీ కోసం తలపడతాయి. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే రోజు రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు విడుదల చేశారు. దాదాపుగా ఏడేళ్ల తర్వాత వైజాగ్ వేదికగా కబ్బడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో కబ్బడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హోమ్ టీమ్ అయిన తెలుగు టైటాన్స్ 2018లో చివరిసారిగా ఆరోస్థానాన్ని చేరినా ఆ తర్వాత జరిగిన అన్ని సీజన్లలో టేబుల్‌ల్లో అట్టడుగుకే పరిమితమైంది. ఈసారైనా బలంగా సత్తా చాటాలని తెలుగు టైటాన్స్ జట్టు ప్రణాళికలు రచిస్తుంది. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రెండో భాగం జైపూర్ లోని ఇండోర్ హాల్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడో దఫా చెన్నై చివరిగా ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. ప్రస్తుతం లీగ్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రో కబ్బడ్డీ లీగ్ నిర్వాహకులు.. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రో కబడ్డీ సీజన్ 12 ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లేదా జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష్య ప్రసారం చేయనున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)