జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర

Telugu Lo Computer
0


తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క - సారలమ్మ జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమై ప్రకటించారు. 2026 జనవరి 28 బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేసి, గోవింద రాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు. జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. జనవరి 30 శుక్రవారం భక్తులు తమ మొక్కుబడులను సమర్పించుకునే ప్రత్యేక దినంగా ఉంటుంది. జనవరి 31 శనివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశం తో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని పూజారులు తెలిపారు. పూజారుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం అధికారికంగా జాతర నిర్వహణాధికారులు పరిశీలించి సమీక్షించనున్నారు. మేడారం జాతరకు లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విచ్చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)