ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యువత కోసం త్వరలోనే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఉద్యోగం లేని అర్హులైన యువతకు నెల నెలకు ఆర్థిక సహాయం అందించబోతున్నట్టు చెప్పారు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తెదేపా-జనసేన-బీజేపీ కూటమి ప్రతిపాదించిన సూపర్ సిక్స్ పథకాలు పక్కాగా అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 'తల్లికి వందనం' కార్యక్రమానికి రూ.10,000 కోట్లు కేటాయించామని, వచ్చే నెల 15 నుంచి మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ పథకాలన్నీ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడ్డాయని చెప్పారు. పీ4 పథకం ద్వారా సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడం, అన్ని వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు తన ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు.
యువత కోసం త్వరలోనే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభిస్తాం : సీఎం చంద్రబాబు
July 02, 2025
0
Tags