తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి మదురై జిల్లా అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సదస్సు సందర్భంగా పవన్ కళ్యాణ్ మతం మరియు ప్రాంతాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు FIRలో ఉన్నాయి. మదురైలో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమిళనాడులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు
July 02, 2025
0
Tags