ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ పరీక్షలు

Telugu Lo Computer
0


2026 విద్యా  సంవత్సరం నుండి టెన్త్ క్లాస్ పరీక్షలు  రెండుసార్లు నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి - మే నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని, రెండో దశ పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్‌ఈ వెల్లడించింది. మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ దశ పరీక్షలు మేలో నిర్వహిస్తారు. వీటి ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లలో ప్రకటిస్తారు. అయితే విద్యార్థులు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలలోని ఏవైనా మూడు సబ్జెక్టులలో వారి స్కోర్‌ను పెంచుకోవడానికి రెండో దశ పరీక్షలు రాయాలి. ఫిబ్రవరిలో సీబీఎస్‌ఈ ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. తాజాగా వీటికి ఆమోదం లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)