రాజా రఘువంశీ హత్య కేసులో అత్యంత కీలకమైన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు, అతను, అతని భార్య సోనమ్ (ప్రధాన నిందితురాలు) కలిసి కొండలెక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి తీస్తున్న వీడియోలో వీరిద్దరూ కనిపించారు. మేఘాలయలోని పచ్చని పర్వతాల పైకి ట్రెక్కింగ్ చేస్తున్నట్లు వీరిద్దరూ కనిపించారు. మే 23న ఉదయం 9:45 గంటల ప్రాంతంలో సోనమ్, రఘువంశీ కొండ ఎక్కడాన్ని ఒక వ్యక్తి చిత్రీకరిస్తున్న వీడియోలో వీరిద్దరూ అనుకోకుండా తారసపడ్డారు. అదే రోజు మధ్యాహ్నం, సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా నియమించుకున్న ముగ్గురు హంతకులు రాజాను హత్య చేసి లోయలో పడేశారు. ఇక, ఈ వీడియో విషయానికొస్తే, దేవ్ సింగ్ అనే టూరిస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో సోనమ్, రాజా కొండపైకి వెళ్తున్నట్టు కనిపించారు. సోనమ్ ముందు వెళ్తుండగా, రాజా ఆమెను అనుసరిస్తున్నాడు. ఈ వీడియోలో సోనమ్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కనిపించింది. దీనిని మేఘాలయ పోలీసులు నేరస్థలం దగ్గర కనుగొన్న సంగతి తెలిసిందే. ఆమె ఒక పాలిథిన్ బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లింది. దానిలో రెయిన్‌కోట్ ఉందని చెబుతున్నారు. సోనమ్ ముగ్గురు సహచరులు వారిని అనుసరిస్తున్న సమయంలో ఇది జరిగింది
రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు వీడియో విడుదల
June 16, 2025
0
Tags