బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ఎన్‌ఎమ్‌సీ ముందు హాజరు కావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శమన్నారు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం, ఈరోజు కమిటీ వేయడం హాస్యస్పదమన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్ 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్‌కు ఎవరు భరోసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థుల జీవితాలు నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన
June 16, 2025
0
Tags