భారత వ్యాపార విభాగానికి అరుణ్ శ్రీనివాస్‌ను మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌గా నియమిస్తున్నట్లు మెటా ప్రకటించింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ తెలిపింది. 2020లో మెటాలో చేరిన ఆయన ప్రస్తుతం కంపెనీ భారత వ్యాపార ప్రకటనలకు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. మెటా వ్యాపార దీర్ఘకాలిక వృద్ధికి, కంపెనీని మరింత సమర్థంగా ముందుకు నడిపించేందుకు అరుణ్ శ్రీనివాస్ నియామకం ఉపకరిస్తుందని మెటా ఓ ప్రకటనలో పేర్కొంది. ఐఐఎమ్ కోలకతా నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పొందిన అరుణ్ శ్రీనివాస్ గతంలో హిందుస్థాన్ యూనిలీవర్, రీబాక్, ఓలా, పెట్టుబడి సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి కంపెనీలలో సేల్స్, మార్కెటింగ్ విభాగంలో దాదాపు 30 సంవత్సరాల పాటు పనిచేశారు. అరుణ్ శ్రీనివాస్ నియామకం పట్ల ఇండియా, ఆగ్నేయాసియా మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ స్పందిస్తూ.. కీలకమైన మార్కెట్‌ను నడిపించే బాధ్యతను అరుణ్ తీసుకోవడంపై అభినందనలు తెలిపారు. బృందాన్ని సమర్థంగా నడిపించడం, ఆవిష్కరణల విషయంలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని కొనియాడారు.
మెటా ఇండియా హెడ్‌గా అరుణ్ శ్రీనివాస్
June 16, 2025
0
Tags